: హైదరాబాదు టూ తిరుపతి...వయా కడప!: ఉగాది నుంచి ‘చెర్రీ ఫ్లైట్స్’ కొత్త జర్నీ


ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి నుంచి టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ కొత్త రూట్ లో సర్వీసును ప్రారంభించనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపాటి ఉమేశ్ తో కలిసి చెర్రీ... టర్బో మేఘా ఎయిర్ వేస్ పేరిట విమానయాన సంస్థను ప్రారంభించి ట్రూజెట్ ఫ్లయిట్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా కొన్ని మార్గాలకే పరిమితమైన ట్రూజెట్ సేవలు ఉగాదిని పురస్కరించుకుని ‘హైదరాబాదు- కడప- తిరుపతి’ మార్గంలో కొత్త సర్వీసును ప్రారంభించనున్నాయి. ఉదయం 10.05 గంటలకు హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే ట్రూజెట్ విమానం 11.10 గంటలకు కడప చేరుకుంటుంది. అక్కడి నుంచి 11.35 గంటలకు బయలుదేరే సదరు విమానం తిరుపతి ఎయిర్ పోర్టులో మధ్యాహ్నం 12.20 గంటలకు ల్యాండవుతుంది. వెనువెంటనే 12.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరే ఆ విమానం కడప మీదుగా మళ్లీ హైదరాబాదు చేరుకుంటుందని టర్బో మేఘా ఎయిర్ వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేశ్ తెలిపారు.

  • Loading...

More Telugu News