: 'ఆనందమంటే ఇదే'.. టీమిండియా ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ ట్వీట్!
నిన్నటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. దీనిపై బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ భారతాభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 'ఆనందమంటే ఇదే.. హాహాహా! సెమీస్‌లో భారత్ ఓడిపోయింది' అంటూ ముష్ఫికర్ రహీమ్ ట్వీట్ చేశాడు. దీనిపై భారతాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో రహీమ్ తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు సారీ కూడా చెప్పాడు. 'అందరికీ సారీ.. వెస్టిండీస్‌కు నేను పెద్ద మద్దతుదారుడిని. అయినప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నా' అని పేర్కొన్నాడు. ముష్ఫికర్ రహీమ్ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా భారతాభిమానులు అతన్ని విమర్శిస్తూనే ఉన్నారు.