: ‘అలీబాబా’కు తలుపులు బార్లా!... ఈ-కామర్స్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్


ఈ-కామర్స్ రంగం శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లోకి దూకేందుకు చైనా ఈ-కామర్స్ దిగ్గజం ’అలీబాబా’ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో ఆ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. ‘అలీబాబా’కే కాక ఇతర దేశాల్లోని ఈ-కామర్స్ సంస్థలకు కూడా తలుపులు బార్లా తెరవడానికి నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమైంది. ఇకపై ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ వంద శాతం పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే ‘అలీబాబా’ భారత్ లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News