: నాకు ఆయాసం తెప్పించాడు... విరాట్ నాకు డబ్బివ్వాల్సిందే: ధోనీ
నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 51 బంతుల్లోనే 82 పరుగులు చేసి ఒంటిచేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీ తనకు ఎంతో కొంత డబ్బివ్వాల్సిందేనని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ ఆటలో 31 బంతుల్లోనే 67 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ ఆటను కొనియాడుతూనే, తాను సింగల్ తీద్దామని అనుకున్నప్పుడల్లా కోహ్లీ రెండో పరుగు కావాలని అరిచేవాడని, దీంతో అతనితో సమానంగా తానూ పరుగులు పెట్టానని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ ఆటతీరు అద్భుతమని, ఇదే సమయంలో తనతో వికెట్ల మధ్య అలసట వచ్చేలా పరుగులు పెట్టించి, ఆ పరుగులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ, తనకు డబ్బివ్వాలని సరదాగా డిమాండ్ చేశాడు. ఓ రన్నర్ ఎదురుగా ఉంటే ఎలా పరుగులు దొంగిలించవచ్చో కోహ్లీ చేతల్లో చూపాడని అన్నాడు.