: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్-2 నుంచి సెమీస్ చేరనుంది. దీంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. పంజాబ్ లోని మొహాలిలో జరుగుతున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. కాగా, మహిళల టీ20లో భాగంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇదే పిచ్ పై అంతకుముందు జరిగింది. ఈ మ్యాచ్ లో విండీస్ చేతిలో ఓటమిపాలైన మిథాలీ సేన్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగింది.