: టీ20 వరల్డ్ కప్ లో సంచలనం... విండీస్ పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం
టీ20 వరల్డ్ కప్ లో సంచలనం చోటు చేసుకుంది. వెస్టిండీస్- ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఆఫ్గాన్ విజయం సాధించింది. గ్రూప్-1లో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ చేరిన వెస్టిండీస్ ఈ రోజు జరిగిన నామమాత్రపు మ్యాచ్ లో పసికూన ఆఫ్గాన్ చేతిలో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ట నష్టానికి 123 పరుగులు చేసింది. స్కోర్లు: ఆఫ్గనిస్తాన్ 123/7, వెస్టిండీస్ 117/8