: ఇండియాకు దేవుడిచ్చిన వరం మోదీ: వెంకయ్య పొగడ్తల వర్షం

భారత ప్రధాని నరేంద్ర మోదీపై వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. 'ఇండియాకు దేవుడిచ్చిన వరం మోదీ' అని కొనియాడారు. మోదీ దేశంలోనే అత్యంత పాప్యులర్ అయిన నేతని, పేద ప్రజలకు అండగా నిలిచే వ్యక్తని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజున వెంకయ్య ప్రసంగిస్తూ, ప్రతి రంగంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, వాటిని ఎదుర్కొనడంలో మోదీ ముందుండి దేశ ప్రజలను నడిపిస్తున్నారని అన్నారు. టైమ్ మ్యాగజైన్ 2015 సంవత్సరానికిగాను ఎంపిక చేసిన ప్రభావశీలుర జాబితాలో మోదీకి స్థానం దక్కిందని గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం మోదీ తన సత్తా చాటుతున్నారని, ట్విట్టర్ లో 1.8 కోట్ల మంది, ఫేస్ బుక్ లో 3.2 కోట్ల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ తుస్సాడ్స్ మైనపు మ్యూజియంలో మోదీ బొమ్మ కొలువుదీరడం, ఆయన పాప్యులారిటీకి అద్దం పడుతుందని అన్నారు. భారత్ ను మోదీ అభివృద్ధి పథంలో మరో మెట్టెక్కించారని పొగిడారు.

More Telugu News