: రిజర్వేషన్ వదులుకుంటున్నానని ప్రకటించిన బీహార్ మాజీ సీఎం

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామీ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ తాను రిజర్వేషన్ వదులుకుంటున్నానని ప్రకటించారు. తమ సామాజిక వర్గంలో బలహీనులు ఎవరో వారే రిజర్వేషన్ పొందేందుకు అర్హులు అనే ఉద్దేశంతో రిజర్వేషన్ వదులుకుంటున్నానని ఆయన చెప్పారు. ఇకపై తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ దళిత కార్డుపై ఎన్నికల్లో పోటీ చేయమని ఆయన ప్రకటించారు. జనరల్ కేటగిరీలోనే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. బలహీన వర్గాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలని ఓ ఆర్ఎస్ఎస్ నేత ఇచ్చిన పిలుపుకు స్పందించిన మాంఝీ రిజర్వేషన్ వదులుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా, మాంఝీ బీజేపీతో జతకట్టి గత ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎస్సీ కేటగిరీలోని మహాదళిత్ కులానికి చెందిన వ్యక్తి.

More Telugu News