: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ


కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న ధోనీ ఫీల్డింగ్ ను ఎంచుకుని, పాకిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించాడు. వర్షంతో తడిసిన పిచ్ తొలుత బౌలింగ్ కు సహకరించే అవకాశం ఉండడంతో, దానిని ఉపయోగించుకోవాలని ధోనీ భావిస్తున్నాడు. అందులో భాగంగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ బ్యాట్స్ మన్ ను టీమిండియా బౌలర్లు కట్టడి చేస్తే మిగిలిన పనిని భారత బ్యాట్స్ మన్ పూర్తి చేస్తారని ధోనీ భావిస్తున్నాడు. కీలకమైన టాస్ గెలవడంతో టీమిండియా ఆభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కాగా, ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆటను 18 ఓవర్లకు కుదించారు.

  • Loading...

More Telugu News