చెన్నైలో 139కు మెసేజ్ చేస్తే రైలొచ్చే ఫ్లాట్ ఫాం నంబర్ తెలిసిపోతుంది!
మన మెక్కే రైలు ఏ ఫ్లాట్ ఫాంపైకి వస్తుందో తెలియజేసే పద్ధతిని తమిళనాడు రాజధాని చెన్నైలో అమలు చేయనున్నారు. ప్రయాణికుడి మొబైల్ ద్వారా 139 నంబర్ కు బోర్డింగ్ స్టేషన్, రైలు నంబర్ ను మెస్సేజ్ చేస్తే చాలు.. ఆ ట్రెయిన్ ఏ సమయంలో, ఏ ఫ్లాట్ ఫాంపై ఆగుతుంది అనే సమాచారం మెసేజ్ రూపంలోనే వెంటనే వస్తుంది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధిలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని, త్వరలోనే మిగతా స్టేషన్లలోకి కూడా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.