: వేలానికి మాల్యా ఆస్తులు!... ముంబైలోని ‘కేఎఫ్ఏ’ ఆఫీస్ ప్రారంభ ధర రూ.150 కోట్లు!
వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నుంచి ఎలాగైనా అప్పులు రాబట్టుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ముంబైలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయాన్ని ఇదివరకే స్వాధీనం చేసుకున్న ఎస్బీఐ... దానిని నేడు వేలం వేయబోతోంది. ముంబై సిటీ ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలోని ఈ కార్యాలయానికి ప్రారంభ ధరగా రూ.150 కోట్లను ఎస్బీఐ ప్రతిపాదించింది. ఈ-వేలం తరహాలో జరుగుతున్న ఈ వేలంలో పాల్గొనదలిచే వారు రూ.5 లక్షల ఫీజుతో పాటు రూ.15 లక్షల డిపాజిట్ ను చెల్లించాల్సి ఉంది. ఈ భవనం వేలం పూర్తి కాగానే గోవాలో స్వాధీనం చేసుకున్న రూ.90 కోట్ల విలువ చేయనున్న మాల్యా విల్లాను కూడా ఎస్బీఐ వేలం వేయనున్నట్లు సమాచారం.