: తెలంగాణ బడ్జెట్ 2016-17 ముఖ్యాంశాలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముచ్చటగా మూడవ బడ్జెట్ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దీన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలివి. * మొత్తం బడ్జెట్ రూ. 1,30,415.87 కోట్లు. * ప్రణాళికా వ్యయం రూ. 67,630.73 కోట్లు. * ప్రణాళికేతర వ్యయం రూ. 62,785.14 కోట్లు. * నీటి పారుదల రంగానికి పెద్దపీట. * దశాబ్దాల పాటు తెలంగాణపై వివక్ష కొనసాగింది. * వివిధ కేసులు పరిష్కారమైతే రూ. 4 వేల కోట్ల ఆదాయం. * ప్రజలపై పన్ను భారం లేకుండా చూసేందుకు కృషి * గతంలో ఉన్న విద్యుత్ కోతలు లేకుండా చూశాం. * కేంద్రం నుంచి అందిన సాయం రూ. 450 కోట్లు మాత్రమే. * ఉమ్మడి రాష్ట్ర బకాయిలను చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. * నీటి పారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు. * కాళేశ్వరం ఎత్తి పోతలకు రూ. 6,286 కోట్లు. * పాలమూరు ఎత్తిపోతలకు రూ. 7,861 కోట్లు. * సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.1,150 కోట్లు * టీఎస్ ఐపాస్ తో ఔత్సాహికులకు ఎంతో ఊరట. * రుణమాఫీకి రూ. 3,718 కోట్లు. * తెలంగాణ జీడీపీ 11.47 శాతం. * తలసరి ఆదాయం రూ. 1,43,023. * జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే ఇది రెట్టింపు. * కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ. 28,512.52 కోట్లు. * రెవెన్యూ మిగులు రూ. 3,718.37 కోట్లు. * ద్రవ్య లోటు రూ. 23,467.29 కోట్లు. * ఎస్సీల సంక్షేమానికి రూ. 7,122 కోట్లు. * బీసీల సంక్షేమానికి రూ. 2,538 కోట్లు. * మైనారిటీల సంక్షేమానికి రూ. 1,204 కోట్లు. * ఎస్టీల సంక్షేమానికి రూ. 3,752 కోట్లు. * సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ఏకగవాక్ష అనుమతులు. * వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్. * వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత. * 6 వేల గ్రామాలకు, 12 పట్టణాలకు డిసెంబరులోగా తాగునీరు. * పండ్లు, కూరగాయల సాగు కోసం హార్టీ కల్చర్ కార్పొరేషన్. * ఆసరా పెన్షన్ల కోసం రూ. 4,693 కోట్లు. * కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 738 కోట్లు. * మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,553 కోట్లు. * రహదారులు, భవనాలకు రూ. 3,333 కోట్లు. * బ్రాహ్మణ సంక్షేమానికి రూ. 100 కోట్లు. * గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు రూ. 10,731 కోట్లు. * పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు. * పారిశ్రామిక అభివృద్ధికి రూ. 967 కోట్లు. * ఐటీ శాఖకు రూ. 254 కోట్లు. * ప్రత్యేక అభివృద్ధి నిధిగా రూ. 4,675 కోట్లు. * దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం. * హైదరాబాద్ లో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. * సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వరంగల్ ఎంజీఎం. * ఆరోగ్య రంగానికి రూ. 5,967 కోట్లు. * వ్యవసాయ రంగానికి రూ. 6,759 కోట్లు. * సంస్కృతి, పర్యాటక రంగాలకు రూ. 50 కోట్లు. * అగ్నిమాపక శాఖకు రూ. 223 కోట్లు. * వైద్య పరికరాల కొనుగోలుకు రూ. 600 కోట్లు. * దీనిలో రోగ నిర్ధారణ పరికరాల కొనుగోలుకు రూ. 316 కోట్లు. * విద్యాశాఖకు ఈ ఏడు రూ. 10,738 కోట్లు. * జీహెచ్ఎంసీలో మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు. * ఇతర ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణం. * షెడ్యూల్డ్ తెగల్లోకి వాల్మీకి, బోయలను చేర్చే ప్రతిపాదన. * సంక్షేమానికి రూ. 13,412 కోట్లు. * భవనాల నిర్మాణానికి రూ. 457 కోట్లు. * మైనారిటీల కోసం 70 ఇంగ్లీషు మీడియం ఆశ్రమ పాఠశాలలు. * ఇందుకోసం రూ. 350 కోట్ల కేటాయింపు. * వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే తరగతులు. * హెచ్ఎండీఏకు రూ. 650 కోట్లు. * హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు రూ. 1000 కోట్లు. * ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్ పార్క్. * మెగా ఫుడ్ పార్క్ కు ఇప్పటికే కేంద్రం అనుమతి. * అన్ని మండలాల నుంచి జిల్లా రాజధానికి రెండు లైన్ల రోడ్లు. * జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నాలుగు/ఆరు లైన్ల రోడ్లు. * గతంలో రహదారుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం. * సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ. 140 కోట్లు. * పోలీసు సిబ్బంది క్వార్టర్ల కోసం రూ. 70 కోట్లు.

More Telugu News