Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘పొట్టి’ ప్రపంచ కప్ సమరం షురూ!... నేటి నుంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రధాన జట్లు పాల్గొనే మ్యాచ్ ల కంటే ముందుగా ఈ సిరీస్ లో పాల్గొనేందుకు అర్హత కోసం పసికూనల మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి షెడ్యూల్ లో భాగంగా నేటి మధ్యాహ్నం 3 గంటలకు హాంకాంగ్ తో జింబాబ్వే, ఆప్ఘనిస్థాన్ తో స్కాట్లాండ్ లు తలపడనున్నాయి. అసలు సిరీస్ ఈ నెల 15న ప్రారంభం కానున్నప్పటికీ, సిరీస్ లో అర్హత సాధించేందుకు పసికూనలు చేయనున్న విన్యాసాలు కూడా క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకోనున్నాయి.

More Telugu News