రూపాయి రాక, పోక ఇలా!
ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ ను బట్టి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపాయి రాక, పోకల వివరాలు ఇలా ఉన్నాయి.
రూపాయి రాక...
* అప్పులు, ఇతర రుణాలు -21 శాతం
* కార్పొరేషన్ ట్యాక్స్- 19 శాతం
* ఆదాయపన్ను - 14 శాతం
* కస్టమ్స్-9 శాతం
* కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ- 12 శాతం
* సేవా పన్ను, ఇతర పన్నులు-9 శాతం
* పన్నేతర ఆదాయం - 13 శాతం
* రుణేతర క్యాపిటల్ ఆదాయం - 3 శాతం
రూపాయి పోక...
* రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రణాళికేతర సాయం- 5 శాతం
* రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికా సాయం- 9 శాతం
* కేంద్ర ప్రణాళిక- 12 శాతం
* వడ్డీల చెల్లింపు- 19 శాతం
* రక్షణ రంగం- 10 శాతం
* సబ్సిడీలు- 10 శాతం
* ఇతర ప్రణాళికేతర వ్యయం- 12 శాతం
* పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా- 23 శాతం