పవన్ కల్యాణ్ ఇక సినిమాలకు బై చెబుతారా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ ఇక సినిమాలకు బై చెబుతారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో సినిమాలకు బై చెప్పనున్నారా? ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ న్యూస్ ఇదే! రెండేళ్లలో సినిమాలకు స్వస్తి చెప్పి, తన పూర్తి సమయాన్ని ఆయన రాజకీయాలకు కేటాయించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 2018 సంక్రాంతికి తన ఆఖరి చిత్రాన్ని విడుదల చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారట. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన అనంతరం తన ‘జనసేన’ పార్టీ కార్యక్రమాల్లో ఆయన మునిగిపోతారని, 2019 అసెంబ్లీ ఎన్నికలలో దిగడానికి సమాయత్తమవుతారని తెలుస్తోంది. ఈ రెండు, మూడేళ్లలో సుమారు రూ.100 కోట్లు సంపాదించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

More Telugu News