: మీడియాపై సెటైర్ వేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియాపై సెటైర్లు వేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, 'మీరు స్క్రిప్టు రాస్తే మేము నటిస్తా'మని అన్నారు. 'మామూలుగా అలాగే కదా జరుగుతుంది' అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు కూడా. ఏమైనా మీడియాకు ముందుగానే అన్నీ తెలిసిపోతాయని ఆయన అన్నారు. దీంతో జర్నలిస్టులు నవ్వేశారు. ఆ నవ్వులో ఆయన కూడా శృతి కలిపారు. అనంతరం తిరిగి మాట్లాడుతూ, టీడీపీని బలోపేతం చేయడం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. నవ్యాంధ్రను ఉన్నత పథంలో నిలపడం కూడా తమ ప్రధాన కర్తవ్యమని ఆయన చెప్పారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, వారిని బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.