: ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలో స్మార్ట్ ఫోన్ సొంతం కావాలంటే..!
కేవలం రూ. 251 ధరలో నేటి సాయంత్రం విడుదల కానున్న రింగింగ్ బెల్స్ 'ఫ్రీడమ్ 251' కోసం నెటిజన్లు, ముఖ్యంగా యువత ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతోంది. ఈ ఫోన్ ఎక్కడ లభిస్తుంది? రేపే కొనుగోలు చేయాలంటే ఎలా? వంటి క్వైరీస్ తో గూగుల్ సెర్చింజన్ కు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఫోన్ బుకింగ్స్ రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 21 రాత్రి 8 గంటల వరకూ పలు ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా బుకింగ్స్ ను తీసుకుంటామని రింగింగ్ బెల్స్ వర్గాలు వెల్లడించాయి. ఆపై డెలివరీలను ప్రారంభిస్తామని, జూన్ 30లోగా రిజిస్ట్రేషన్ లు చేసుకున్న అందరికీ డెలివరీ అందిస్తామని, ఆపై బహిరంగ మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపాయి.