: చూయింగ్ గమ్ తో నోటి ఆరోగ్యమే కాదు.. డబ్బు కూడా ఆదా: బ్రిటన్ యూనివర్శిటీ


నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో చూయింగ్ గమ్ పాత్ర ఎంతో ఉంటుంది. అంతేకాదు, తద్వారా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే సొమ్ము కూడా ఆదా అవుతోందని బ్రిటన్ లోని ప్లిమౌత్ యూనివర్శిటీ పేర్కొంది. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా బ్రిటన్ లోని 12 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత చూయింగ్ గమ్ నమలడం పరిపాటి. ఈ అలవాటు వల్ల నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్)కు ప్రతి ఏటా దాదాపు 80 లక్షల పౌండ్లు ఆదా అవుతున్నట్లు తేలిందని వర్శిటీ పేర్కొంది. ఈ సందర్భంగా చూయింగ్ గమ్ నమలడం వల్ల చేకూరే ప్రయోజనాలను ప్లిమౌత్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రస్తావించారు. ఏదైనా తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత షుగర్ లెస్ చూయింగ్ గమ్ ను నమలడం వల్ల ఉమ్మి ఉత్పత్తి అవుతుందని, పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగించేందుకు అది సహకరిస్తుందని అన్నారు. పళ్లను బలహీనపరిచే ప్లేక్ యాసిడ్స్ ను క్రమబద్ధీకరించేందుకు, దంత సంరక్షణకు చూయింగ్ గమ్ ఉపయోగపడుతుందన్నారు.

  • Loading...

More Telugu News