: ప్రేమలో పడిన ప్రియమణి... త్వరలో పెళ్లి!

సినీ నటి ప్రియమణి త్వరలో పెళ్లి చేసుకుంటోంది. ప్రియుడు ముస్తఫా రాజ్ ను త్వరలో పెళ్లాడనున్నట్టు ప్రియమణి ఓ షోలో వెల్లడించింది. ముంబైలోని ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పని చేస్తున్న ముస్తఫా రాజ్ ను ఓ డ్యాన్స్ షోలో కలిశానని ప్రియమణి తెలిపింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసిందని ఆమె చెప్పింది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాది చివర్లో వివాహం జరుగుతుందని తెలిపింది. పెళ్లి తరువాత కూడా నటించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. మంచి స్క్రిప్ట్ తో మళ్లీ అభిమానుల ముందుకు వస్తానని ప్రియమణి చెప్పింది.

More Telugu News