: 'రొమాంటిక్ డిన్నర్'కే ప్రేమికుల ఓటు!


ప్రేమికుల రోజును నిర్వహించుకోవద్దంటూ వీహెచ్పీ, భజరంగ్ దళ్ వంటి సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కొన్ని చోట్ల బెదిరింపులకు కూడా దిగుతున్నాయి. ఈ దశలో ప్రేమికుల రోజు జరుగుతుందా? అన్న అనుమానాలు సైతం పలువురిలో నెలకొన్నాయి. అయితే ప్రేమికులు మాత్రం వేలంటైన్స్ డే నిర్వహించుకునేందుకు తమకు ఎలాంటి అడ్డంకులు లేవంటున్నారు. మనసుంటే మార్గముంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమికుల రోజును మించిన ముహూర్తం మరొకటి లేదని పేర్కొంటున్నారు. అయితే ప్రేమికుల రోజును ఎలా నిర్వహించుకోవాలనుకుంటున్నారన్న ప్రశ్నకు రొమాంటిక్ డిన్నర్ అయితే బావుంటుందని పేర్కొంటున్నారు. ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది ప్రేమికులు ఇలా రొమాంటిక్ డిన్నర్ కే ఓటువేశారు. ఇంకొంతమంది హెలికాప్టర్ పై ప్రియురాలిని తీసుకెళ్లడం బావుంటుందని అభిప్రాయపడ్డారు. మరికొంత మంది ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రియురాళ్లను ఆనందంలో ముంచెత్తాలని భావిస్తున్నారు. ప్రేమికుల రోజు నిర్వహించుకునేందుకు మన దేశంలో ప్రేమికులు మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News