: ఒబామాతో మల్లికా షెరావత్ సెల్ఫీ... ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ కు ఓ మంచి అవకాశం చిక్కింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి సెల్పీ తీసుకునే అవకాశాన్ని దక్కించుకున్న మల్లిక, తన సెల్ ఫోన్ లో సెల్ఫీ తీసుకుంది. వెనువెంటనే దానిని నిన్న ట్విట్టర్ లో పోస్ట్ చేసేసింది. ఒబామాతో సెల్ఫీ... తనకు మాత్రమే దక్కిన మహదావకాశంగా పేర్కొన్న మల్లిక, ఆ క్షణాల్లో చాలా గర్వంగా ఫీలయ్యానంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ సెల్ఫీ ఎప్పుడు, ఎక్కడ తీసుకుందన్న విషయాన్ని మాత్రం ఆమె పేర్కొనలేదు.