: షాట్ సెలక్షన్ లో తప్పులు చేశాం...ఓటమి మంచిదే!: ధోనీ
శ్రీలంకతో పూణేలో జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో ఓటమి టీమిండియాకు మంచే చేసిందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ, బ్యాట్స్ మన్ షాట్ సెలక్షన్ కొంపముంచిందని అన్నాడు. వన్డేల్లా వేచి చూసి ఆడే అవకాశం టీట్వంటీల్లో ఉండదని ధోనీ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టాపార్డర్ విఫలం కావడంతో జట్టులోని అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని, దీంతో ఎవరు ఎలా ఆడతారు అనే అంచనా చిక్కిందని ధోనీ పేర్కొన్నాడు. జట్టు మొత్తం విఫలమవడంతో విజయగర్వంతో ఆడకూడదని ఆటగాళ్లకు అర్థమై ఉంటుందని ధోనీ చురకంటించాడు. శ్రీలంక ఆటగాళ్లలో రజిత, శనక, చమీరలు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. రెండో టీట్వంటీలో టీమిండియా పుంజుకుంటుందని ధోనీ భరోసా ఇచ్చాడు.