: ఢిల్లీలో అధికార పార్టీకే ఓటమి తప్పలేదు.. మేమెంత?: గ్రేటర్ రిజల్ట్స్ పై కేఈ కామెంట్

గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీలో గతేడాది జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే పరాజయం తప్పలేదు. ఇక మేమెంత?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షను విరమింపజేసేందుకు రంగంలోకి దిగిన కేఈ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ ఫలితాలపై స్పందిస్తూ అధికారంలో ఉన్న పార్టీలకూ ఒక్కోసారి ఓటమి తప్పదన్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీకి కూడా ఈ దఫా ఓటమి ఎదురైందన్నారు. రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు సహజమేనని కేఈ వ్యాఖ్యానించారు.

More Telugu News