: మూఢనమ్మకానికి సవాల్ విసిరిన వ్యాపారవేత్త
శుభకార్యాలకు వితంతువులను దూరంగా ఉంచడం అనేది హిందూ సమాజంలో అనాదిగా వస్తోంది. అయితే, తన కుమారుడి వివాహం సాక్షిగా ఈ మూఢనమ్మకాన్ని రూపుమాపాలని గుజరాత్ లోని మొహసనా ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త జితేంద్ర పటేల్ (జీతూ భాయ్) సంకల్పించారు. దీంతో తానుండే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల్లోని 18 వేల మంది వితంతువులను తన కుమారుడి వివాహ మహోత్సవానికి ఆహ్వానించారు. దీంతో వేలాదిగా తరలి వచ్చిన వితంతువులు జీతూ భాయ్ కుమారుడు, కోడల్ని దీవించారు. తాను మూఢవిశ్వాసాలను నమ్మనని చెప్పిన జీతూభాయ్, వారి దీవెనలు తన కుటుంబానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.