: ఇబ్బందుల్లో పడ్డ హార్డిక్ పాండ్య

టీమిండియా కొత్త బౌలర్ హార్డిక్ పాండ్య ఇబ్బందుల్లో పడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 37 పరుగులు ఇచ్చిన పాండ్య రెండు కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఆరంభంలోనే మూడు వైడ్లు సంధించి ఇబ్బంది పడిన పాండ్య క్రిస్ లిన్ వికెట్ తీశాడు. ఈ ఆనందంలో అతని ముందుకు వెళ్లి అభ్యంతరకరంగా వ్యవహరించాడు. దీనిపై రిఫరీకి ఆసీస్ బోర్డు ఫిర్యాదు చేసింది. దీంతో వీడియోలు పరిశీలించిన రిఫరీ పాండ్యకు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించే అవకాశంతో పాటు, అతని ప్రవర్తనపై మందలింపు లేదా, చర్యలు తీసుకునే అవకాశం కనపడుతోంది.

More Telugu News