: నిరాండబర జీవితం ‘రజనీ’ స్టయిల్!

సినిమాల్లో ఎంతో స్టైలిష్ గా కనపడే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిజ జీవితంలో వెరీ సింపుల్ గా ఉంటారు. ఎంత సింపుల్ అంటే.. బూట్లు ధరించడానికి కూడా ఆయన ఇష్టపడరు. ఖరీదైన కార్లున్నా.. స్కూటర్ పై వెళ్లడమంటేనే ‘రజనీ’ కి ఇష్టం. తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘తలైవా’కు అభిమానులు ఎంతగా నీరాజనాలు పడతారన్నది జగమెరిగిన సత్యమే! విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశమున్నప్పటికీ సాధారణ వ్యక్తిలా ఉండేందుకు ఇష్టపడే ఆ పద్మవిభూషణుడి గురించి కొన్ని విశేషాలు.. * రకరకాల రుద్రాక్షలను సేకరిస్తుంటారు * గతంలో నలుపు రంగు ..ప్రస్తుతం తెలుపు రంగు వస్త్రాలను ఇష్టపడుతున్నారు * షూటింగ్ సమయంలో తప్పా, మరెప్పుడూ మేకప్ వేసుకోరు, ఆభరణాలను ఇష్టపడరు * మటన్ కర్రీ, మెరీనా బీచ్ లో వేరుశెనక్కాయలంటే మహా ఇష్టం * విదేశాల్లో బస్సెక్కితే నిలబడే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే, కండక్టర్ గా పనిచేసినప్పటి రోజులు గుర్తుకొస్తాయంటారు * హఠాత్తుగా స్నేహితుల ఇళ్లకు వెళ్లి వారితో కలసి భోజనం చేస్తారు. వారికి విలువైన కానుకలను కూడా తీసుకువెళుతుంటారు. * తన వద్ద పనిచేసే వారికి చెన్నైలో ఫ్లాట్లు కొనిపెట్టడంతో పాటు వారి పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా చేశారు. * తన సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఆ చిత్ర యూనిట్ కు నగదు బహుమతులిస్తుంటారు. అందుకు తన సొంత డబ్బునే వెచ్చిస్తారు. కాగా, చెన్నైలోని ఆయన నివాసం పేరు బృందావన్. ఆ పేరుకు తగ్గట్టుగానే అందరికీ ప్రేమాభిమానాలను పంచుతూ ఉండే రజనీ కాంత్ దిగ్గజ దర్శకుడు బాలచందర్ ని గురువుగా భావిస్తారు. ‘ముల్లుం మలరుం’ చిత్రంలో ‘రజనీ’ అద్భుత నటనను మెచ్చుకుంటూ బాలచందర్ నాడు రాసిన ఒక లేఖను ఇప్పటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు.

More Telugu News