: హెచ్ సీయూలో వార్!... క్లాసులకెళతామంటున్న విద్యార్థులు, కుదరదంటున్న ఏఎస్ఏ

రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో హై టెన్షన్ వాతావరణం నెలకొన్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నేటి ఉదయం సరికొత్త వివాదం నెలకొంది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావును సస్పెండ్ చేయడంతో పాటు రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్ కు కారణమైన ఇన్ చార్జీ వీసీ విపిన్ శ్రీవాస్తవను విధుల నుంచి తప్పించాలని అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్(ఏఎస్ఏ) రోజుల తరబడి ఆందోళన కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తరగతులు జరగకపోతే విద్యా సంవత్సరం నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేసిన కొంతమంది విద్యార్థులు నేటి ఉదయం క్లాసులకెళ్లేందుకు సిద్ధపడ్డారు. సమాచారం అందుకున్న ఏఎస్ఏ విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో మరోమారు వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News