: అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా రోజాకు బుద్ధి రాలేదు: మంత్రి పీతల
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో వైసీపీ ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, తరువాత మంత్రి పీతల సుజాతపై రోజా తీవ్ర ఆరోపణలు చేయడం... తెలిసిందే. దానిపై ఇవాళ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా ఆమెకు బుద్ధి రాలేదన్నారు. ఆమెను సభ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరతానని చెప్పారు. దళితులను అవమానించడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని, రోజాను అడ్డుపెట్టుకుని దళిత మంత్రినైన తనను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని పీతల మీడియా ముఖంగా ప్రకటించారు.