: ఇండియా నుంచి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ అమెరికన్ పైలట్
ముంబై నుంచి అమెరికాకు ప్రయాణికుడి రూపంలో వచ్చిన అమెరికన్ పైలట్, 2 లక్షల డాలర్లు, బంగారు నగలతో పట్టుబడ్డాడు. డల్లాస్ కు చెందిన ఆంటోనీ వార్నర్ అనే వ్యక్తి, ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పైలట్. ఇండియాకు ఎప్పుడు వచ్చాడో వివరాలు తెలియలేదు గానీ, తిరుగు ప్రయాణంలో నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వార్నర్ వద్ద ఉన్న డబ్బు, బంగారం నగల గురించి ప్రశ్నించగా, సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. దీంతో స్మగ్లింగ్ కేసు పెట్టిన నెవార్క్ ఎయిర్ పోర్టు పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.