Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

50 ఏళ్లలో చేయలేనిది 5 ఏళ్లలో చేస్తాం: కేటీఆర్

గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో 100 సీట్లను గెలుస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వంద సీట్లు గెలుస్తామని చెప్పడం అతి విశ్వాసం కాదని, తమ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకమని చెప్పారు. గత 50 ఏళ్లలో చేయలేని పనులను కేవలం 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపుతుందని ఆయన చెప్పారు. హైదరాబాదులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, వారంతా టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతారని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమకు శత్రువులు కాదని, కేవలం సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. అందరితో స్నేహంగా ఉండడమే టీఆర్ఎస్ లక్ష్యమని ఆయన చెప్పారు.

More Telugu News