: ధోనీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్... జారీ చేసిన ‘అనంత’ కోర్టు

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే టెస్టు కెరీర్ కు గుడ్ బై చెప్పిన ‘విన్నింగ్ టీం’ కెప్టెన్, తాను ఆడుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్ లోనూ అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలో ధోనీకి రిటైర్మెంట్ టైం దగ్గరపడిందన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో అతడికి మరో షాకిస్తూ ఏపీలోని అనంతపురం జిల్లా కోర్టు నేడు సంచలన నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రకటనల్లో భాగంగా గతంలో అతడు దేవతలను అవమానించాడని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన అనంతపురం కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వచ్చే నెల 25న తమ ముందు హాజరుకావాలని ఆ వారెంట్లలో అతడిని ఆదేశించింది.

More Telugu News