: యూకే నన్ను నిషేధిస్తే నా పెట్టుబడులు వెనక్కి తీసుకుంటా: డొనాల్డ్ ట్రంప్
అమెరికాలోకి ముస్లింలు రాకుండా వారిపై నిషేధం విధించాలంటూ పారిస్ దాడుల సందర్భంగా, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఆయనను దేశంలోకి రానివ్వద్దని యూకే ప్రజలు చేసిన డిమాండ్ ను ఆ దేశం ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సంతకాల సేకరణ చేపట్టడం, ఈ నెల 18న చర్చ కూడా చేపడుతుండటంతో ట్రంప్ ముందస్తుగా తనదైన శైలిలో స్పందించి యూకే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. యూకే తనపై నిషేధం విధిస్తే ఆ దేశంలోని తన పెట్టుబడులను (యూకే గోల్ఫ్ కోర్సుల్లో ట్రంప్ 700 మిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టారు) వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. తనపై నిషేధం విధిస్తే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రపంచానికి తప్పుడు సంకేతం ఇచ్చినట్టేనని ట్రంప్ పేర్కొన్నారు.