: ముష్కరుల మృతదేహాల చిత్రం... వారు వస్తున్నట్టు ముందే చెప్పిన రాడార్లు!

నిన్న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి జరిపిన ఉగ్రవాదుల చిత్రాలను భద్రతా దళాలు విడుదల చేశాయి. అంత తేలికగా ఎవరూ అనుమానించకుండా ఉండేలా మిలటరీ దుస్తుల్లో, అత్యాధునిక ఆయుధాలతో వచ్చిన వీరిని సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా, వీరు ఎయిర్ బేస్ లో కాలుమోపుతుండగానే ఏరియల్ సర్వైలెన్స్ రాడార్లు ఎవరో అక్రమంగా ప్రవేశిస్తున్నట్టు మానిటర్లపై చూపాయి. ఆ వెంటనే అధికారులు అప్రమత్తం కావడంతోనే పెద్ద ప్రమాదం తప్పింది. పాక్ సరిహద్దుకు కేవలం 40 కిలో మీటర్ల దూరంలో ఉండే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో మిగ్-21 యుద్ధ విమానాలు, ఎంఐ-25 ఫైటర్ చాపర్లు ఉంటాయి. వాటిల్లో ఏ ఒక్క దాన్ని ఉగ్రవాదులు అపహరించినా పెను నష్టం జరిగుండేది.

More Telugu News