: రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం...పలు అంశాలపై చర్చించనున్న మంత్రి మండలి
తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని రేపు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా మంత్రి మండలి చర్చించనుంది. జీహెచ్ఎంసీలోని నల్లా బిల్లులు, కరెంటు బిల్లుల రద్దు, గ్రేటర్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భవనాలు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై చర్చ, గోదావరిపై పలు బ్యారేజీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఆస్తి పన్ను రూ.1,200 లోపు నగర వాసులు రూ.101 చెల్లిస్తే సరిపోతుందని తెలంగాణ సర్కార్ నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నల్లా బిల్లులను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.