: శిరిడీ సాయినాధుడికి భారీ విరాళాలు

మహారాష్ట్రలోని శిరిడీలో ఉన్న సాయినాథుడి ఆలయానికి గత నెల 24 నుంచి 27వ తేదీ వరకు భారీ ఎత్తున విరాళాలు అందాయని అకౌంట్స్ అధికారి డాక్టర్ జిర్ పే వెల్లడించారు. ఆ రోజుల్లో నగదు రూపంలో 3.53 కోట్ల రూపాయలతో పాటు 3481 గ్రాముల బంగారం, పది కేజీల వెండిని భక్తులు సాయినాధునికి సమర్పించినట్టు ఆయన తెలిపారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం సాయినాధుని ఆలయానికి భక్తులు పోటెత్తారని ఆలయాధికారులు తెలియజేశారు.

More Telugu News