కీలకం తేలలేదు కానీ.. విశ్వంలో కృష్ణపదార్థం తక్కువే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కీలకం తేలలేదు కానీ.. విశ్వంలో కృష్ణపదార్థం తక్కువే

ఎందుకు? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇంకా జవాబులు అన్వేషించాల్సి ఉంది. అయితే బిగ్‌బ్యాంగ్‌.. మహావిస్ఫోటం జరిగిన తర్వాత.. ఏర్పడిన వాటిలో కృష్ణపదార్థం కంటె పదార్థం మోతాదు చాలా ఎక్కువని మాత్రం శాస్త్రవేత్తలు ధ్రువీకరిస్తున్నారు. దీనికి వారొక కొత్త రుజువును కూడా కనుగొన్నారు. జెనీవా సమీపంలోని సెర్న్‌లార్జ్‌ హ్యాడ్రన్‌ కొలైడర్‌ శాస్త్రవేత్తలు ఒక ఉపపరమాణు కణాన్ని గుర్తించారు. ఈ కణం క్షీణిస్తోందని.. ఇందులో కృష్ణపదార్థం కన్నా.. పదార్థమే అధికంగా ఉన్నదని వారు తేల్చిచెప్పారు.

సాధారణంగా బిగ్‌బ్యాంగ్‌ జరిగినప్పుడు కృష్ణపదార్థం, పదార్థం రెండూ సమానంగా ఏర్పడ్డాయనేది నమ్మకం. అయితే.. ఇవి అసమాన పాళ్లలో ఏర్పడ్డాయని నిరూపించినందుకు 1980లో ఇద్దరు అమెరికన్లు నోబెల్‌ పొందారు కూడా. అసమానత్వపు కారణం అంతుచిక్కకపోయినా.. తాజా పరిశీలన ద్వారా కూడా.. ఆ విషయం ధ్రువపడుతోంది.

More Telugu News