: 'డీడీసీఏ' వ్యవహారంలో సెక్స్ రాకెట్ కూడా వుంది... కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారంలో ఆర్థిక కుంభకోణంతో పాటు సెక్స్ రాకెట్ కూడా దాగి ఉందని చెప్పారు. క్రికెటర్ల ఎంపికలో భాగంగా.. కుమారుడిని క్రికెట్ టీమ్ లోకి తీసుకోవాలని డీడీసీఏను కోరితే తన భార్యను శారీరక సుఖం కోసం పంపాలని ఓ అధికారి అడిగినట్టు ఓ సీనియర్ జర్నలిస్ట్ తనతో చెప్పి వాపోయారని కేజ్రీ వెల్లడించారు. అయితే ఆ అధికారి ఎవరు, ఆ జర్నలిస్ట్ ఎవరన్న విషయాన్ని మాత్రం చెప్పాలనుకోవడం లేదని అన్నారు. డీడీసీఏ స్కాంపై ఎవరు విచారణ చేసినా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువుకు భంగం వాటిల్లుతుందని చెప్పారు. సీబీఐకి తాను భయపడబోనన్న కేజ్రీ, తనపైనా తర్యాప్తు చేసుకోవాలని సవాల్ చేశారు.