: అప్పుడు సోనియాగాంధీ అన్నారు... ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు: జగన్ పై గంటా ఫైర్
తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం వెనక ఓ కార్పొరేట్ కంపెనీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉన్నారని గతంలో ఆరోపించిన జగన్... ఇప్పుడు మాటమార్చారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. తన తండ్రి మరణానికి చంద్రబాబు కారణం అనే రీతిలో జగన్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని అన్నారు. జగన్ ఫ్యాక్షనిస్టు కావడం వల్లే అతని పార్టీ సభ్యులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రసంగిస్తూ చంద్రబాబు తల నరుకుతామని అనడం అత్యంత దారుణమని... జగన్ ఫ్యాక్షనిస్టు కావడం వల్లే ఆ పార్టీ వారికి కూడా అవే మాటలు వస్తున్నాయని మండిపడ్డారు. తండ్రి మరణాన్ని కూడా జగన్ రాజకీయాలకు వాడుకోవడం దారుణమని అన్నారు.