: ఏటీఎంను బద్దలు కొట్టి..దోచుకెళ్లారు!
ఏటీఎంను బద్దలు కొట్టి రూ.4.75 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లిన సంఘటన మంగళవారం పంజాబ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పగ్వారా జిల్లా ఖొత్రాన్ గ్రామంలోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలోకి దుండగులు ప్రవేశించారు. ఏటీఎంను బద్దలు కొట్టి క్యాష్ బాక్స్ లను పట్టుకుపోయారు. అందులో డబ్బును తీసుకుని ఖాళీ బాక్స్ లను సమీపంలో ఉన్న చెరకు తోటల్లో పడేసిపోయారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.