: ఒట్టు... ఆ పని ఇప్పట్లో చెయ్యకూడదనుకున్నా!: బాలీవుడ్ నటి ప్రీతి జింతా


కొత్త సంవత్సరంలో తాను పెళ్లి చేసుకోవటం లేదని బాలీవుడ్ అందాల నటి ప్రీతి జింతా పేర్కొంది. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని... వాటిని నమ్మవద్దని తన అభిమానులకు ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. ‘ఒట్టేసి చెబుతున్నా... వచ్చే ఏడాదిలో నేను పెళ్లి చేసుకోవడం లేదు. పెళ్లి చేసుకోబోయే ముందు నేనే తెలియజేస్తాను' అని సొట్టబుగ్గల సుందరి పేర్కొంది. కాగా, కొద్ది రోజులుగా గినె అనే అమెరికన్ తో ఈమె సన్నిహితంగా ఉంటోందని, అతన్ని పెళ్లాడుతుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా, ఇప్పటికే వారి నిశ్చితార్థం కూడా అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలన్నింటినీ ఖండిస్తూ ప్రీతి జింతా ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News