: భారత్ ఎంత భద్రం?... హోం శాఖ అత్యవసర సమావేశం


ఇండియాపై, అందునా రాజధాని ఢిల్లీ నగరంపై ఐఎస్ఐఎస్ ప్రేరేపిత పాక్ ఉగ్రవాదులు వాయు మార్గాన దాడులు జరపవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో హోం శాఖ కదిలింది. అందుబాటులో ఉన్న ఉన్నతాధికారులతో నార్త్ బ్లాక్ లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని 15 ముఖ్యమైన ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు ప్లాన్ వేశారన్న ఐబీ నివేదికపై వీరు చర్చించారు. భారత్ ఏ మేరకు భద్రంగా ఉంది, ఉగ్రదాడులు జరిగితే ఎంత త్వరగా తిప్పికొట్టగలమన్న విషయాలపై వీరు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఏ గుర్తు తెలియని వస్తువైనా అనుమానాస్పదంగా గాల్లో ఎగురుతుంటే, దాన్ని కూల్చివేసేందుకు అనుమతిని ఇచ్చినట్టు హోం శాఖ అధికారులు వివరించారు. కాగా, ప్రధాని నివాసం, రాష్ట్రపతి, హోం మంత్రి, ఉపరాష్ట్రపతి నివాసాలు, రాజ్ పథ్, ఇండియా గోట్, సీజీఓ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలపై దాడులు జరపవచ్చని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News