: అన్ని అనుమతులతోనే నూడుల్స్ విడుదల చేశాం: రాందేవ్ బాబా ప్రకటన
పతంజలి నూడుల్స్ కు ‘ఫుడ్ సేఫ్టీ’ అనుమతులు లేవన్న మీడియా కథనాలపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఘాటుగా స్పందించారు. తమ సంస్థ ఉత్పత్తి చేసిన నూడుల్స్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని రాందేవ్ ప్రకటించారు. నూడుల్స్ అమ్మకాల విషయంలో కేంద్రమే తమకు లైసెన్స్ ఇచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. పతంజలి నూడుల్స్ కు అనుమతులు లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ చెప్పారని నిన్న కొన్ని ఆంగ్ల పత్రికలు వార్తలు రాశాయి. వీటిపై పతంజలి సంస్థ ప్రతినిధులు నిన్ననే స్పందించగా, నేటి ఉదయం రాందేవ్ బాబా ప్రతిస్పందించారు.