: నెల్లూరు, రంగారెడ్డి జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు

ఏపీలోని నెల్లూరు జిల్లా, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం, చాకలిగొండ, గొల్లవారపల్లి, పత్తినివారిపల్లిలో భూమి కంపించింది. వింజమూరు మండలంలో ఏకంగా 5 సెకన్లపాటు ఈ ప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు భయాందోళనలతో పరుగులుతీశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం జల్ పల్లి గ్రామంలో రాత్రి 8.15 గంటలకు పది సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తమ పిల్లలతో కలసి వీధుల్లోకి చేరుకుని ఏం జరుగుతోందోనని ఆందోళన చెందారు. జల్ పల్లి, వాదిహుదా, శ్రీరామకాలనీ, షాహిన్ నగర్ ప్రాంతాల్లో ఈ ప్రకంపన చోటుచేసుకుంది. ఈ విషయంపై శాస్త్రవేత్తలను సంప్రదించగా భూమి కంపించిన విషయాన్ని ధ్రువీకరించలేదు.

More Telugu News