: వివాహానికి ఆహ్వానించా... రాజకీయాలు మాట్లాడలేదు: జయప్రద

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కలుసుకున్నారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో ఆమె సీఎంను కలిశారు. సమావేశం అనంతరం జయప్రద మాట్లాడుతూ, తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికే ముఖ్యమంత్రిని కలిశానని, ఆహ్వాన పత్రికను అందించానని తెలిపారు. రాజకీయాలకు సంబంధించి తాము చర్చించుకోలేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఉన్నట్టుండి చంద్రబాబు కార్యాలయానికి జయప్రద రావడంతో అందరూ షాక్ అయ్యారు. టీడీపీలోకి జయప్రద మళ్లీ రాబోతున్నారా? అనే చర్చకు తెరలేచింది. అయితే, ఆ ఆలోచనలకు ముగింపు పలికి, ఆమె నవ్వుతూ వెళ్లిపోయారు.

More Telugu News