: నేడు భూమికి చేరువగా భారీ గ్రహశకలం
ఓ భారీ గ్రహశకలం నేడు భూమికి అత్యంత చేరువలోకి రానుంది. దీని పేరు '2015 టీబీ 145'. దీని వ్యాసం 1300 అడుగులు. సెకనుకు 35 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోంది. భూమికి సుమారు 4,80,000 కిలోమీటర్ల దూరంలో ఇది ప్రయాణించబోతోంది. మరో విషయం ఏమిటంటే, ఈ గ్రహశకలాన్ని ఈ నెలలోనే గుర్తించారు. 2015 టీబీ 145 రాకతో అంతరిక్ష పరిశోధకులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. గ్రహశకలాల గురించి మరింత కచ్చితమైన సమాచారాన్ని కనుక్కొనేందుకు ఇదే సరైన సమయమని వారు చెబుతున్నారు.