: అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తున్న అంతుబట్టని వస్తువు... 13న ఢీ!


నవంబర్ 13న గుర్తుతెలియని ఓ 'స్పేస్ జంక్' (అంతరిక్షంలో వృథాగా పరిభ్రమించేవి) భూమిని ఢీకొట్టనుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది ఏమిటన్న విషయం స్పష్టంగా తెలియదని, దీనికి 'డబ్ల్యూటీఎఫ్' అని పేరు పెట్టామని వెల్లడించిన సైంటిస్టులు, శ్రీలంక తీరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హిందూ మహా సముద్రంలో ఉదయం 6:15 గంటల సమయంలో ఇది కూలుతుందని వివరించారు. "అంతరిక్ష చరిత్రలో ఉనికిని పోగొట్టుకున్న ఓ వస్తువేదో మనల్ని వెంటాడుతూ వస్తోంది" అని హార్వార్డ్ -స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త జొనాథన్ మెక్ డొవెల్ వెల్లడించారు. దీన్ని ఆరిజోనా వర్శిటీలోని కాటలినా స్కై సర్వే సెంటర్ తొలిసారి గుర్తించిందని తెలిపారు. ఇది భూమి వాతావరణంలోకి రాగానే మండిపోతుందని, కాబట్టి మానవాళికి ప్రమాదం ఉండదని అన్నారు. ఈ తరహా అంతరిక్ష వ్యర్థాలు సుమారు 5 లక్షలకు పైగా భూమికి సమీపంలో తిరుగుతున్నట్టు గతంలో నాసా ప్రకటించింది.

  • Loading...

More Telugu News