: ప్రజలను హింసిస్తే తాట తీస్తాం... ‘కాల్ మనీ’కి బోండా ఉమ వార్నింగ్
నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడలో ప్రజలను బెంబేలెత్తిస్తున్న కొత్త దందా ‘కాల్ మనీ’పై నగరంలోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు. అధిక వడ్డీల పేరిట ప్రజలను హింసించే వారి తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. కాల్ మనీ నిర్వాహకులపై నేటి ఉదయం నగరానికి చెందిన ఓ మహిళ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజులుగా వరుసగా వెలుగు చూస్తున్న కాల్ మనీ వ్యాపారుల దందాపై సమగ్ర సమాచారం సేకరించిన బోండా ఉమ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను వేధించే వారిని తమ ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించబోదని హెచ్చరించారు. అక్రమ దందారాయుళ్లు తమ దందాను తక్షణమే నిలిపివేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.