: పండితులు నిర్ణయించిన సుముహుర్తం ఇది!: చంద్రబాబు


ప్రజా రాజధాని శంకుస్థాపన ఈ నెల 22న విజయదశమి రోజున నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని తెలిపారు. శంకుస్థాపన ముహూర్తాన్ని 12:45 నిమిషాలకు నిర్ణయించారని అన్నారు. ఈ సమయాన్ని వేద పండితులు మంచి సమయంగా నిర్ణయించారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ సరిగ్గా 12 గంటలకు అమరావతికి చేరుకుంటారని బాబు చెప్పారు. అనంతరం 12:35 నిమిషాలకు పూజామండపం వద్దకు చేరుకుంటారని ఆయన తెలిపారు. పండితులు నిర్ణయించిన మూహూర్తం ప్రకారం 12:45 నిమిషాలకు రాజధానికి శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News