: విజయవాడ, తిరుపతి, విశాఖలలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ లోని మూడు నగరాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ముందడుగు పడింది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో రూ.1,240 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ మూడు చోట్ల ఎమ్యూజ్ మెంట్, వాటర్ వరల్డ్ పార్కులు నిర్మించనున్నారు. డెస్టినేషన్ అండ్ ప్యాకేజ్ టూర్లు, హోటల్స్, రిసార్టులు, బీచ్ రిసార్టులు, ఫైవ్ స్టార్, త్రీస్టార్ హోటళ్లు ఏర్పాట్లు చేయనున్నారు. కడపలో వే సైడ్ అమెనిటీస్ ఏర్పాటు తదితరాలకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. తిరుపతి తిరుచానూరులో గేట్ వే హోటల్ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. రెండెకరాల విస్తీర్ణంతో రూ.85 కోట్ల పెట్టుబడితో హోటల్ నిర్మాణం జరగనుంది.