: రోడ్డు ప్రమాదాల్లో ప్రస్తుతం నాలుగు నిమిషాలకొకరు... భవిష్యత్ లో మూడు నిమిషాలకొకరు మృత్యువాత

ప్రపంచంలోని అతి పెద్ద రోడ్డు నెట్ వర్క్ కలిగిన రెండో దేశమైన భారత్ లో ప్రతి నాలుగు నిమిషాలకొకరు చొప్పున మృత్యువాత పడుతున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడే ప్రమాదముందని ఆ సంస్థ వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన రోడ్డు భద్రత అంశంపై జరిగిన సెమినార్ లో సదరు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, గత పదేళ్లలో భారత్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పది లక్షల మంది ప్రజలు మృత్యువాతపడ్డారని అన్నారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్ లో జరగగా, రెండవ స్థానంలో తమిళనాడు నిలిచిందని వారు వెల్లడించారు.

More Telugu News